వందేళ్ల ప్రజా పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం
విజయ రాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి: భారతదేశంలో వందేళ్ళ ప్రజా పోరాటాల చరిత్ర గల ఏకైక పార్టీ సిపిఐ అని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు అన్నారు. మార్చి 23న జిల్లా కేంద్రంలో సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య సమావేశంలో మాట్లాడారు. ముందుగా శతజయంతి ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభలో సిపిఐ పక్ష నేత కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగాపాల్గొంటారన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అన్నారు. బిజెపి పూర్వరూపం జనసంఘ్ అన్నారు. అనేక రూపాలు మార్చుకొనినేడు బిజెపిగా మారిందన్నారు. 1885లో జాతీయ కాంగ్రెస్ గా అవతరించిన కాంగ్రెస్ అనేక రూపాలు మార్చుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిందన్నారు. సిపిఐ ఆవిర్భావం నుంచి నేటి వరకు అదే పేరుతో కొనసాగుతోందన్నారు. స్వాతంత్ర పోరాటంలోకమ్యూనిస్టు యోధులు ప్రాణత్యాలు చేశారన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ కోసం పోరాడింది అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టు యోధులు అమరులయ్యారన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర దేశంలో ఏ పార్టీకి లేదన్నారు. 1952 లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి నెహ్రూ కంటే అధిక మెజార్టీతో ఎంపీగా గెల్పొందారున్నారు. ఆనాటి పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించింది కూడా రావి నారాయణరెడ్డి అని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు అధికారంతో సంబంధం లేకుండా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ పోరాటాలు కొనసాగిస్తూనే ఉందన్నారు. ఘన చరిత్ర గల సిపిఐ శతజయంతి ఉత్సవాలు వనపర్తి జిల్లా కేంద్రంలో మార్చి 23న భగత్ సింగ్ జయంతి రోజు జరుపుకోవటం గర్వకారణం అన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ, దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో గొప్ప సభ జరుగుతుందని జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సిపిఐ పోరాట ఉద్యమ స్ఫూర్తిని చాటాలన్నారు.సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, గోపాలకృష్ణ, ఎత్తం మహేష్ , విష్ణు, ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. (Story : వందేళ్ల ప్రజా పోరాటాల చరిత్ర సిపిఐ సొంతం