చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
అకాడమిక్ ఆడిట్ నిర్వహణ
న్యూస్‌తెలుగు/చింతూరు : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్.కె.రత్న మాణిక్యం ఆధ్వర్యంలో బుధవారం అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల విద్యాశాఖ నియమించిన సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకులు వి.వి సుబ్బారావు మరియు రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు ఎస్.ఆర్.బి చక్రవర్తి అకడమిక్ అడ్వైజర్స్ గా హాజరై అధ్యాపకులందరికీ మార్గనిర్దేశకత్వం చేశారు. అలాగే వి.వి సుబ్బారావు, కళాశాల అభివృద్ధికి నాక్ ఎక్రిడిటేషన్ సంసిద్ధం కావడానికి సలహాలను అందించగా, ఎస్.ఆర్.బి చక్రవర్తి నాక్ అక్రిడేషన్ లో పాటించవలసిన మెలకువలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం కళాశాల ప్రత్యేకతలు, బోధనకు సంబంధించిన వివరాలను అకాడమిక్ అడ్వైజర్స్ కి తెలియజేశారు. (Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్ నిర్వహణ )