ఇంటింటికీ మంచినీరు, టిడ్కో ఇళ్ల పూర్తికి జీవీ విజ్ఞప్తి
అసెంబ్లీలో మున్సిపల్ వ్యవహారాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ :గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం సహకారంతో ప్రారంభించి, జగన్ ప్రభుత్వం ఆగిపోయిన మంచినీటి పథకాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణకు – ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలోనే వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, చిలకలూరిపేట సహా అనేక పట్టణప్రాంతాలు వాటి పూర్తి కోసం ఎదురు చూస్తున్నాయని, వేగంగా చర్యలు తీసు కోవాలని కోరారు. బుధవారం అసెంబ్లీలో మున్సిపల్ వ్యవహారాలపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నాడు కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు సహకారంతో సీఎం చంద్రబాబు అమృత్ పథకం తీసుకుని వచ్చారన్నారు. ఆ పథకం కింద 8వేల 500 కోట్లు మంజూరయ్యాయ ని, కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం ఇస్తే ఆ పథకం పూర్తి అవుతుందని తెలిపారు. అలాంటిది కేంద్రం రూ.600కోట్లు ఇచ్చినా జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వక ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయని, కూటమి ప్రభుత్వంలోనైనా వాటిని పూర్తి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. అమృత్ పథకం ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతో పాటు టిడ్కో ఇళ్లకు అలానే చేశారన్నారు. కనీసం 10శాతం పనులు కూడా చేయకుండా పాడుపెట్టారని.. వాటికి మోక్షం కల్పించాలని కోరా రు. ఈ ప్రశ్నకు స్పందించిన మంత్రి నారాయణ టిడ్కో ఇల్లు, అమృత్‌స్కీమ్ త్వరలోనే పూ్తి చేస్తామని తెలిపారు. ప్రతిఇంటికి, ప్రతి వ్యక్తికి 135లీటర్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడేళ్లలో అవన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. (Story : ఇంటింటికీ మంచినీరు, టిడ్కో ఇళ్ల పూర్తికి జీవీ విజ్ఞప్తి)