Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు

వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు

వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు

శాసనసభలో మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ : మహాభారతంలో ఒకడే కీచకుడు ఉంటే… వైకాపా పాలనలో మాత్రం రాష్ట్రంలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడని, వారిపై నేరాల్లో రాష్ట్రాన్ని తలవంచుకునే పరిస్థితుల్లో నిలబెట్టారని ప్రభుత్వ చీఫ్‌ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. ఎక్కడ మహిళలు గౌరవం అందుకుంటారో అక్కడ దేవతలు కొలువుదీరతారని చంద్రబాబు నమ్మితే.. ఆ మాటకు అర్థం లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. బుధవార ఈ మేరకు శాసనసభలో మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌ విప్ జీవీ అయిదేళ్ల వైకాపా పాలనలో మహిళలకు చేసిన అన్యాయాలపై నిప్పులు చెరిగారు. మొదట్నుంచి మహిళా పక్షపాతిగా ఉన్న చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో వారి దశ మార్చితే జగన్ వారిని రోడ్లపాలు చేశారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రూ.18వేల కోట్లు పసుపుకుంకుమ కింద ఇస్తే జగన్ కల్తీ మద్యంతో 30వేలమంది అక్కచెల్లెమ్మల తాలిబొట్లు తెంచారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గంజా యి, డ్రగ్స్‌కు నిలయంగా చేసి పట్టపగలు కూడా ఆడవారి రోడ్లపై తిరగలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. వైకాపా పాలనలో 250మంది ఎస్సీ మహిళలు,ఎస్టీ ఆడబిడ్డలు 2వేల 27 హత్యకు గురయ్యారన్నారు. మహిళలపై 2లక్షల 4వేల 414 నేరాలు జరిగాయని, ఒక్కమాట లో చెప్పాలంటే గడిచిన అయిదేళ్లు రాష్ట్రంలో పరిస్థితి తాలిబన్ల పాలన కంటే ఘోరంగా తయారు చేశారని మండిపడ్డారు. సుమారు 4వేల34 అత్యాచారాలు జరిగాయని, 22వేల 272 మంది మహిళలు అదృశ్యమయ్యారని, అయినా వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. వినుకొండలో 70ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం జరిగితే వైకాపా కార్యకర్తలు చేశారని కేసునే తొక్కిపెట్టేశారని చర్యలు లేకపోతే భయం ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. జగన్ తీరుతో మహిళలపై నేరాల్లో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో మళ్లీ మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారని. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాల తో సాధికారితకు బాటలు వేసుకుంటున్నారని తెలిపారు. ఆమేరకు శాంతిభద్రతలు పూర్తిస్థాయి లో మెరుగు పరిచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. (Story : వైకాపా పాలనలో అడుగుకో కీచకుడు మహిళలను వేధించాడు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!