Homeవార్తలుఏప్రిల్ 18న 'చౌర్య పాఠం' 

ఏప్రిల్ 18న ‘చౌర్య పాఠం’ 

ఏప్రిల్ 18న ‘చౌర్య పాఠం’ 

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 18న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. పరీక్షలు ముగిసి, వేసవి సెలవులు ప్రారంభమౌతున్నందున ఈరిలీజ్ డేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు పర్ఫెక్ట్ టైం. వినోదాన్ని ఆస్వాదించాలనుకునే స్నేహితులకు ఈ మూవీ ఒక సరదా ప్రయాణంగా ఉంటుంది. లీడ్ యాక్టర్స్ వారి ముఖాలను రహస్యంగా కప్పి ఉంచిన రిలీజ్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతుంది.

విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉన్నందున, చిత్ర బృందం ప్రమోషనల్ యాక్టివిటీస్ ని వేగవంతం చేస్తోంది.

ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ ఈ కథను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని రాశారు. అతను కెమెరా వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. దావ్‌జాంద్ మ్యూజిక్ అందిస్తున్నారు.  హనుమాన్ ఫేమ్ శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌. ఉతుర ఎడిటింగ్ విధులను నిర్వహిస్తున్నారు.

తారాగణం: ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల, మస్త్ అలీ, మాడి మానేపల్లి, అంజి వల్గుమాన్, ఎడ్వర్డ్ పెరేజీ, సుప్రియ ఐసోలా, క్రీష్ రాజ్, సహదేవ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – నిఖిల్ గొల్లమారి
నిర్మాత – నక్కిన త్రినాధరావు
బ్యానర్-నక్కిన నెరేటివ్
కథ & డీవోపీ – కార్తీక్ ఘట్టమనేని
ప్రొడక్షన్ డిజైన్ – శ్రీ నాగేంద్ర తంగాల
సంగీతం – దావ్‌జాంద్
ఎడిటర్ – ఉత్తర
సహ నిర్మాత – వి చూడామణి
సాహిత్యం – బాస్కర బట్ల, కళ్యాణ చక్రవర్తి, రోల్ రైడా, కృష్ణకాంత్ (కెకె) , నిఖిల్ గొల్లమారి
కొరియోగ్రఫీ :- విజయ్ బిన్ని, విజయ్ పోలాకి
పీఆర్వో – వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్ – అనిల్ & భాను (Story : ఏప్రిల్ 18న ‘చౌర్య పాఠం’ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!