వైసీపీలో చేరికలు
న్యూస్ తెలుగు/ సాలూరు : మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర సమక్షంలో తెలుగుదేశం ,జనసేన కార్యకర్తలు వైయస్సార్ పార్టీలో చేరిక వీరందరికీ వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజన్న దొర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్నాలన్నీ ఒకటి కూడా ఇవ్వకుండా ప్రజలను ,నిరుద్యోగులను, విద్యార్థులను, మహిళలను, బడుగు బలహీన వర్గాల వారిని, అన్ని వర్గాల వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు విసుగు చెంది తిరిగి వైయస్సార్ పార్టీలోకి చేరడానికి ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు యువకులు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరారని వారందరికీ భవిష్యత్తులో పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు కిలపర్తి ఓంకేసు, ప్రేమ్, దిలీపు, వెంకటేష్ మనోజు, బాలాజీ, తనూజు, సతీష్ , గణేసు, నవీన్ ,శీను, సంతోష్ ,ప్రసాదు ,ధర్మరాజు ,వంశీ తదితరులు పాల్గొన్నారు. (Story : వైసీపీలో చేరికలు)