Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నిరుద్యోగ భృతి బ్రాంతియేనా..!

నిరుద్యోగ భృతి బ్రాంతియేనా..!

నిరుద్యోగ భృతి బ్రాంతియేనా..!

న్యూస్ తెలుగు /సాలూరు : నిరుద్యోగ భృతి అంత బ్రాంతియేనా బాబు, జాబు క్యాలెండర్ ఏది బాబు, ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ బాబు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర ప్రశ్నించారు సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేసిందని అన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా అని అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఒక విద్యార్థికి కూడా రియంబర్స్మెంట్ ఇవ్వలేదని అన్నారు. ఈ రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులైన బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనారిటీ అగ్రవర్ణాల పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు కట్టుకోలేక వారు హాల్ టికెట్లు ఇవ్వకుండా చేయడంతో పరీక్షలు రాయకుండా విద్యార్థులు నష్టపోయారని అన్నారు. విద్యా దీవెన వసతి దీవెన ఏ ఒక్కరికి ఈ ఆర్థిక సంవత్సరం ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ స్కూల్లో సిబిఎస్, ఐబి సిలబస్ లను తీసివేసారని అన్నారు. నాడు నేడు రద్దు చేశారని అన్నారు. పేద విద్యార్థులు ఇంగ్లీష్ చదువుకొని ఉన్నత చదువులకు వెళ్ళకూడదా చంద్రబాబు అని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక నిరుద్యోగి కైనా ఉద్యోగం ఇచ్చారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్లు నిరుద్యోగులకు ప్రతినెలా 3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. నిరుద్యోగి బృతి రెండు సంవత్సరాలుగా ఇవ్వలేదని నిరుద్యోగులకు 66 వేల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉందని వెంటనే నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులకు ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని అందులో ఐదు మెడికల్ కాలేజీలో ప్రారంభమయ్యాయని అన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని అన్నారు. అందుకే విజ్ఞులు మేధావులైన నిరుద్యోగ యువతి యువకులారా విద్యార్థులారా ఒక్కసారి ఆలోచించుకొని
ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరుబాటకు ఈనెల 12వ తేదీన పార్వతిపురం జిల్లా కలెక్టర్లకు డిమాండ్లతో వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి, నిరుద్యోగులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు 12వ తారీఖున తరలిరావాలని అన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ,మండలం ,గ్రామాల వారిగా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున నిరుద్యోగ యువకులను విద్యార్థులను వారి తల్లిదండ్రులను తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు గొర్లె వెంకటరమణ సింగారపు ఈశ్వరరావు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు (Story : నిరుద్యోగ భృతి బ్రాంతియేనా..!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!