Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పూలే, ఎన్టీఆర్‌ బాటలో మహిళల కోసం చంద్రబాబు కృషి

పూలే, ఎన్టీఆర్‌ బాటలో మహిళల కోసం చంద్రబాబు కృషి

పూలే, ఎన్టీఆర్‌ బాటలో మహిళల కోసం చంద్రబాబు కృషి

వినుకొండలో మహిళా దినోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

న్యూస్ తెలుగు / వినుకొండ : జ్యోతిరావు పూలే, ఎన్టీఆర్ బాటలో రాష్ట్రంలో మహిళా సాధకారిత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పదింతలు కృషి చేస్తున్నారని ప్రభుత్వ ఛీప్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నాడు జ్యోతిరావు పూలే దంపతుల సంస్కరణ ఉద్యమంతో మహిళా సాధికారితలో విద్య అవసరం గురించి తెలిపారని వారి సంకల్పాన్ని ఆడవారికి ఆస్తి హక్కు ద్వారా ఎన్డీఆర్ ముందుకు తీసుకుని వెళ్లారన్నారు. అదేబాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రగతిపథాన ముందుకు నడిపిస్తున్నారన్నారు. శనివారం వినుకొండ టిడిపి కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి తెలుగింటి ఆడపడుచులు, మాతృసమానులైన మహిళామణులకు జీవీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన జీవీ మహిళా సాధికారిత, వారికి రక్షణ తెలుగుదేశం సిద్ధాంతాల్లో ఒకటిగా పేర్కొన్నారు. మహిళల సాధికారితతోనే రాష్ట్రం, దేశంలో అభివృద్ధి నమ్మి డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చి.. దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దింది ఘనత సీఎం చంద్రబాబుది అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఉన్న మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్‌లో మహిళాశిశు సంక్షేమానికి రూ. 4,332కోట్లు కేటాయించిడం, దీపం-2 పథకం ద్వారా 90 లక్షల మంది మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు, రాయితీ రుణాలు సాధికారితస్వప్నంలో భాగంగా చేస్తున్నవే అన్నారు. మహిళలకు ఎక్కడ గౌరవం, సంతోషం ఉంటాయో, ఎక్కడ చట్టాల్ని గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి ఉంటుందన్నారు. తమ ప్రభుత్వంలో ఇళ్లు, ఇంటి పట్టాలు ప్రతిదీ కూడా మహిళల పేరుతోనే ఇస్తున్నామని గుర్తు చేశారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్న లక్ష్యంలో భాగంగా మహిళలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళలకు ర్యాపిడో వాహనాలు అందించడం వారికి ఉపాధి అవకాశాల్లో కొత్తశకానికి నాందిగా పేర్కొన్నారు. తద్వారా మహిళలకు ఉపాధి, రక్షణ రెండూ లభిస్తాయన్నారు. మహిళా హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ సందర్భంగానే తన విజయాలు బాటలు వేసింది, ఆది గురువుగా నిలిచింది తన మాతృమూర్తి అని గుర్తు చేసుకున్నారు. ఆమెతో పాటు అక్క ఎంతో చేశారన్నారు. అలాంటి అక్కచెల్లెమ్మలు అందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, మహిళా కౌన్సిలర్లు, మహిళా ప్రజాప్రతినిధులు, తెలుగు మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : పూలే, ఎన్టీఆర్‌ బాటలో మహిళల కోసం చంద్రబాబు కృషి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!