శ్రామిక మహిళల పోరాటం తోనే హక్కులు : ఎన్ఎఫ్ఐ
న్యూస్తెలుగు/వనపర్తి : శ్రామిక మహిళల పోరాటంతోనే మహిళలకు హక్కులు వచ్చాయని ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కళావతమ్మ, వనపర్తి జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి అన్నారు. వనపర్తి సిపిఐ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కేతేపల్లి మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీగా పనిచేసిన కళావతమ్మను మహిళా నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రపంచం పలు దేశాల్లో కార్ఖానాలు, షాపుల్లో పనిచేసే శ్రామిక మహిళలు ఓటు హక్కు కోసం, 8 గంటల పరిధిలో కోసం, సమాన వేతనం కోసం అనేక ఏళ్లుగా పోరాటం సాగించి విజయం సాధించారన్నారు. 1975 మార్చి 8ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గా ప్రకటించిందన్నారు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి దశాబ్దాలు గడిచినా నేటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదన్నారు.8 గంటల పని దినం సాధించుకున్నా, మళ్లీ 12 గంటలకు పెంచాలని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మహిళలకు పని ప్రదేశాల్లో భద్రత లేదన్నారు. హత్యలు అత్యాచారాలు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. మహిళా సాధికారికత కోసం మహిళలు పోరాడాలని అందుకు సంఘటతం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ మహిళల హక్కుల కోసం జరిగిన ప్రపంచ పోరాటాలు, విజయాలను వివరించారు. జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు భూమిక, కల్పన నాయకులు శ్రీదేవి, చెన్నమ్మ, అంజనమ్మ, వెంకటమ్మ, జయశ్రీ, సుమిత్ర, లావణ్య, లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. (Story : శ్రామిక మహిళల పోరాటం తోనే హక్కులు : ఎన్ఎఫ్ఐ)