మార్చి9న జరిగే ఆదివాసి జె ఏ సి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చెయ్యండి
ఆదివాసీ చట్టాలు,జీవోలను పకడ్బందీగా అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి చింతూరు డివిజన్ కమిటీ
న్యూస్ తెలుగు /చింతూరు : ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఏ సి వార్షిక ఉద్యమ కార్యాచరణ పై మార్చి 09 న జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చెయ్యాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ పిలుపునిచ్చారు. ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రమ్ లో రోజురోజు ఏజెన్సీ ప్రాంతంలో చాపకింద నీరుల గిరిజనేతరల వలసలు పెరుగుతూ ఆదివాసీ సమాజన్ని అణచివేస్తున్నారని, మా ప్రాంత సంపడను అక్రమంగా దోచుకుంటూ, పక్కలో బల్లెంల ఉంటూ మన చట్టాలను మన ప్రజా ప్రతినిధులతోనే తొలగించే విధంగా కుట్ర చేస్తున్నారని, ఈ విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. అలాగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసిజె ఎ సి కమిటీలను బలోపేతం చేసుకుంటూ.. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం. టీ ఎ సి ఏర్పాటు, టీ ఎ సి భవన నిర్మాణం. యల్ టి ఆర్ చట్టం పటిష్టంగా అమలు చేయాలి యస్ డి సి (టి డబ్ల్యూ ) కార్యాలయంలో పూర్తిస్థాయి సిబ్బంది ని నియమించి వారితో పని చేయించాలని . పోలవరం నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించినప్పుడే వారిని తరలించాలి. భూ సేకరణ లో జరిగిన అక్రమాలపై ప్రత్యేక విచారణ కమిషన్ వేయాలన్నారు .
పెసా భవనాలు నిర్మించాలి మరియు నిధులు కేటాయించాలి. వంటి మొదలగు డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు శ్రీకాకుళం, మాన్యం, అల్లూరి, ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు, చింతూరు డివిజన్ కమిటీ సభ్యులతో పాటు ముంపు మండల కమిటీ బాద్యులు సభ్యులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు సోడే.నారాయణ,జేఏసీ నాయకులు మోసం.సీతారామయ్య, రామకృష్ణ,రాజు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : మార్చి9న జరిగే ఆదివాసి జె ఏ సి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చెయ్యండి)