అబద్దాల బ్రహ్మనాయుడు భాష మార్చుకో.. మక్కెన
– చీఫ్ విప్ జీవిని విమర్శించే స్థాయి నీకు లేదు
– వ్యక్తిగత విమర్శలు తగవని హెచ్చరిక
న్యూస్ తెలుగు / వినుకొండ : మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసత్యాలు మాట్లాడడం మాని భాష మార్చుకుని గౌరవప్రదంగా మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సూచించారు. టిడిపి కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడివరం గ్రామంలో షేక్ రఫీ అనే వ్యక్తి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు విక్రయాలు చేస్తుండగా రెవిన్యూ అధికారులు దాడులు చేసి యంత్రాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ బొల్లా బ్రహ్మనాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బొల్లా బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలను మక్కెన మల్లికార్జున రావు తీవ్రంగా ఖండించారు. స్థాయిని మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారిని స్థాయిని మరిచి బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించడం తగదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి బ్రహ్మనాయుడు విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం ప్రశాంతంగా సోదర భావంతో కలిసి మెలిసి ఉంటున్న గ్రామాల్లో ప్రజల మధ్య బ్రహ్మనాయుడు చిచ్చు పెడుతున్నాడని అన్నారు. మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని విధానపరంగా మాట్లాడవే తప్ప వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లకు వైసిపి వారిని రానివ్వటం లేదని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ స్టేషన్లో వద్ద సీసీ కెమెరాలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు రైతుపై అక్రమ కేసులు బనాయించిన నీచమైన చరిత్ర బ్రహ్మనాయుడుదని ఆయన ఎద్దేవా చేశారు. నోరు తెరిస్తే అబద్ధాలు, వ్యక్తిగత విమర్శలు మానుకొని గౌరప్రధంగా వ్యవహరించాలని మక్కిన హితవు పలికారు. ఉమ్మడివరం సర్పంచి వీరగంధం ఆనంద్ మాట్లాడుతూ షేక్ రఫీ అనే వ్యక్తి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ తపకాలు చేస్తుంటే రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రఫీ ఆత్మహత్యాయత్నం అనేది ఒక హై డ్రామా అని అన్నారు. గత వారం క్రితం రఫీ అనే వ్యక్తి గ్రామంలో కొందరిని అసభ్యంగా దూషించటం, అతని దుర్భాషలాడిన వీడియోలు కూడా ఉన్నాయని అన్నారు. అలాంటి వ్యక్తిని బ్రహ్మనాయుడు ప్రోత్సహించడంపై గ్రామస్తుల అసహ్యించుకుంటున్నారని అన్నారు. గత వైసిపి పాలనలో బ్రహ్మనాయుడు రాజకీయ కక్ష కట్టి ఎనిమిది మందిపై అక్రమ కేసులు బనాయించారని, తిరుణాలలో ప్రభను కడితే బ్రహ్మనాయుడు అక్రమంగా దాడి చేయించాడని ఎద్దేవా చేశాడు. గ్రామంలో వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను మహిళలను ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ అక్రమంగా మైనింగ్ చేస్తున్న రఫీ లాంటి వ్యక్తులను ప్రోత్సహించడం బ్రహ్మనాయుడుకు తగదన్నారు. సమావేశంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మాదినేని ఆంజనేయులు డీసీ చైర్మన్ కొండలు ఉమ్మడివరం సర్పంచ్ వీరగంధం ఆనంద్ తదితరులు ఉన్నారు. (Story : అబద్దాల బ్రహ్మనాయుడు భాష మార్చుకో.. మక్కెన)