చిట్యాల గ్రామాన్ని విలీనం చేయొద్దు
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి మండలం చిట్యాల గ్రామాన్ని వనపర్తి మునిసిపాలిటీలో విలీనం చేయకూడదని కోరుతూ మంగళవారం గ్రామ నాయకులు రఘుపతిరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. అందుకు సనుకులంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి సూచించినట్లు వారు పేర్కొన్నారు. (Story : చిట్యాల గ్రామాన్ని విలీనం చేయొద్దు)