ఆలపాటి విజయంపై వినుకొండ టీడీపీ నాయకుల అభినందనలు
న్యూస్ తెలుగు/ వినుకొండ : ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ ఆధిక్యంతో విజయం సాధించడం పట్ల వినుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు లక్ష్మీపురంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను కలిసి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు పంచుమర్తి భూపతిరావు, డీసీ ఛైర్మన్ గంగినేని రాఘవరావు, శివశక్తి ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవీ రమణారావు, కార్యాలయ మేనేజర్ రమేష్, దిలీప్ తదితరులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.(Story : ఆలపాటి విజయంపై వినుకొండ టీడీపీ నాయకుల అభినందనలు)