లోక కళ్యాణార్థం జరిగే అతిపెద్ద మహా యాగం జయప్రదం చెయ్యండి
న్యూస్ తెలుగు/వినుకొండ : లోక కళ్యాణార్థం జరిగే అతిపెద్ద మహా యాగం జయప్రదం చేయాలని , అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురువులు పిలుపునిచ్చారు. మహాశివరాత్రి ని పురస్కరించుకొని వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి సాయి బృందావనం చిన్న షిరిడిలో శాంతి ఆశ్రమం ట్రస్ట్ నిర్వహించిన మహాశివరాత్రి మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పూజ్య శ్రీ హిమాలయ గురుజి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ విఠంరాజు పల్లి, సాయి బృందావనం ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో పూజ్య శ్రీ హిమాల గురించి మాట్లాడుతూ. తక్కువ సమయంలో కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి నిర్వహించేందుకు సహకరించిన దాతలకు, భక్తులకు, సేవకులకు మంగళ శాసనాలు తెలిపారు. ఖర్చు విషయంలో అందుకు సంబంధించిన పూర్తి లెక్కలను మీడియా ముందు ఉంచారు. ప్రపంచ శాంతిని కోరుతూ లోక కళ్యాణార్థం తలపెట్టనున్న 12 సంవత్సరాల పాటు నిర్వహించి తలపెట్టిన” మహా యాగం” కార్యక్రమంను జయప్రదం చేసే దిశగా అందరు సహాయ సహకారాలు కావాలని, వినుకొండ ప్రాంతంలో ఈ యాగం నిర్వహించడం పై ఇప్పటికే అన్ని రంగాల వారితో చర్చలు జరుపుతున్నామని, చర్చలు అనంతరం మరోసారి సమావేశం నిర్వహించి యాగం ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే దానిపై పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివశక్తి ఫౌండేషన్ జీవీ రమణ రావు, శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు అధ్యక్షులు పెండ్యాల వెంకట మోహన్ రావు, కనిగండ్ల అనంత కోటేశ్వరరావు, పెండ్యాల కాశి, సుధాకర్, పెండ్యాల పుల్లారావు, మునిరెడ్డి తదితరులు పాల్గొని అన్నసంతర్పణం కార్యక్రమాన్ని నిర్వహించారు.(Story : లోక కళ్యాణార్థం జరిగే అతిపెద్ద మహా యాగం జయప్రదం చెయ్యండి )