నిధులు ఊసే లేని బడ్జెట్..
న్యూస్ తెలుగు/ సాలూరు : బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిధులు ఎక్కడ కేటయించారని అంతా అంకెల గారిది తప్ప ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరదని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి పిడిక రాజన్న దొర అన్నారు. శనివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఈ బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం నిధులు ఎక్కడ కేటాయించారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. గత సంవత్సరం తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సంక్షేమానికి ఎక్కడ నిధులు కేటాయించారో చెప్పాలని అన్నారు. కుటమీ ప్రభుత్వం అధికారంకు వచ్చిన వెంటనే స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి అయినా నిధులు కేటాయించారా అని అన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఒక నిరుద్యోగ యువకుడికైనా ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయించలేదని అన్నారు. అధికారంలోకి వచ్చినంటనే ప్రతి ఆడబిడ్డకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారని ఇప్పుడు ఈ బడ్జెట్ లో నిధులు ఊసే లేదు అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్న మాయమాటలు ప్రజలు గ్రహిస్తున్నారని సమయం వచ్చినప్పుడు మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు.(Story : నిధులు ఊసే లేని బడ్జెట్..)