రాష్ట్ర బడ్జెట్ లో వరికపుడిశల ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం విచారకరం
ఎ. మారుతీ వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి.
న్యూస్ తెలుగు/ వినుకొండ :శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో పల్నాటి ప్రాంత ప్రజల దశాబ్దాల కల లక్షల ఎకరాల సాగు భూమి కి నీరు త్రాగునీరు లభించే ప్రధానమైన ప్రాజెక్ట్ అయిన వరికపూడి శల ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమైన విషయమని, కనీసం ఆ ప్రాజెక్టును త్వరలో ప్రత్యేక కేటాయింపులతో నిర్మిస్తాము అనే పదాలు కాని లేకపోవడం విచారకరమని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ దిశ లేనిదని వ్యవసాయానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు లక్షలాదిగా ఎదురుచూస్తున్న రైతులకు మేలు చేసే విధంగా లేదని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించి సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపు లేకుండా ఉన్నదని, గిట్టుబాటు ధర లేక రైతాంగం అల్లాడుతుంటే ధరల స్థిరీకరణకు కేవలం 300 కోట్లు కేటాయించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో సుమారు 85 లక్షల మంది విద్యార్థులకు కేటాయింపులు కాని వైద్యానికి పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో హాస్పిటల్స్ నిర్మాణానికి నిధుల కేటాయింపు సరిపోయే రీతిలో లేవని ఆయన అన్నారు. 50 లక్షల మంది గా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పథకం ఊసె లేదని జాబ్ క్యాలెండర్ ప్రస్తావన రాలేదని రాజధాని కేటాయింపులు అరకొరగా ఉన్నాయని శుక్రవారం ప్రకటించిన బడ్జెట్ పై ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు.(Story : రాష్ట్ర బడ్జెట్ లో వరికపుడిశల ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం విచారకరం)