ఆర్థిక అక్షరాస్యత, సైబర్ భద్రత ఫై సెమినార్
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థ శాస్త్రము, వాణిజ్య శాస్త్రము ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ముల్లి శేఖర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి, పిఠాపురం రాజా కళాశాల వాణిజ్య శాస్త్ర ఫ్రోపెసర్ డాక్టర్ జె.పాండురంగారావు ముఖ్య వక్త గా విచ్చేసి ” కృత్రిమ మేధస్సు యుగంలో ఆర్థిక అక్షరాస్యత, సైబర్ భద్రత” అనే అంశం ఫై విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాతూ ఆర్థికాభివృద్ధి చెందడం లో, ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.సైబర్ నేరాలు జరుగుతున్న ఈరోజులలో వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ యం. శేఖర్ మాట్లాడుతూ నేటి కాలంలో అనేక సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని,ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉన్నప్పుడే ఆర్థిక నేరాలను అరికట్టగలమన్నారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు జి.వెంకటరావు,డాక్టర్.వై.పద్మ,జి. హారతి,కె.శకుంతల,కె. శైలజ,యం. నాగమోహన్ రావు,కె శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి,రాజబాబు,జి.సాయి కుమార్,యన్.రమేష్,బి.శ్రీనివాసరావు తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది,విధ్యార్థిని,విధ్యార్థులు పాల్గొన్నారు. (Story : ఆర్థిక అక్షరాస్యత, సైబర్ భద్రత ఫై సెమినార్)