మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న దశల వారి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం వినుకొండ మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ. మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సామరస్య పూర్వకంగా ఆలోచించి పరిష్కరించాలని, రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న ఈ కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ పట్టణాలను, నగరాలను, గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వాలు సమ్మె సమయంలో వారికి ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సైతం కనీస వేతనాలు అమలు జరపాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒకపక్క తీర్పులు చెప్తుంటే అవి పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న దళిత బలహీన వర్గాల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని వారు విమర్శించారు. ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని చట్టం కూడా ఈ రోజున కార్మికులకు కనీస వేతనం అమలు జరపాలని ఘోషిస్తోందని వారు అన్నారు. ఆప్కాస్ అమలు జరపాలని అది రద్దు చేసిన ఎడల మున్సిపల్ అధికారులు మునిసిపాలిటీ ద్వారానే కార్మికులు ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ వేతనాలు మరియు డి ఏ లు వెంటనే విడుదల చేయాలని వారుకోరారు మున్సిపాలిటీలకు తగినట్లుగా కార్మికులను పెంచాలని వారు డిమాండ్ చేశారు డ్యూటీలో మరణించిన వారికి రిటైర్ అయిన వారికి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో సిపిఐ నాయకులు బూదాల శ్రీనివాసరావు ఏఐటియుసి నాయకులు పిన్న బోయిన వెంకటేశ్వర్లు,కె. మల్లికార్జున యూనియన్ నాయకులు పచ్చి గొర్ల ఏసు, ఏసు పాదం, సాయిబాబు, ఇంజనీరింగ్ కార్మిక నాయకులు రేవళ్ళ శ్రీనివాస్, నాగూర్ వలీ, కంచర్ల కోటేశ్వరరావు, దేవమ్మ, కొండమ్మ, మరియమ్మ కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి)