ఇష్టపడి చదివితే పాస్ గ్యారంటీ
న్యూస్తెలుగు/చింతూరు: ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదివితే ఉత్తీర్ణులవడం కష్టం కాదని మండల విద్యాశాఖ అధికారి జి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు మోటివేషనల్ క్లాస్ తీసుకున్నారు. పదవ తరగతి పరీక్షలు ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నందున విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ మార్కులతో పాస్ అవ్వాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఇష్టపడి చదివితే 10వ తరగతి పాస్ అవ్వడం కష్టమేమి కాదని విద్యార్థులకు ఉపదేశించారు. పాఠశాలలో నిర్వహించే ప్రత్యేక తరగతులకు విద్యార్థులంతా విధిగా హాజరుకావాలని కోరడం జరిగింది, గత విద్యా సంవత్సరం చింతూరు జడ్పీ పాఠశాల డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని ఈ సంవత్సరం కూడా ఆ విజయాన్ని చింతూరు జిల్లా పరిషత్ పాఠశాల కైవసం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. డివిజన్ స్థాయి,జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక బహుమతులు అందిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ, ఉపాధ్యాయులు సుబ్బయ్య, సుజాత, స్వాతి, నాగరాజు, పెంటమ్మ, భద్రయ్య, శ్రీరామ్, క్లస్టర్ సిఆర్పి బొగ్గ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (Story: ఇష్టపడి చదివితే పాస్ గ్యారంటీ)