Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సీతం లో ఏ క్రిటికల్ ఎనాలసిస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2025 కార్యక్రమం

సీతం లో ఏ క్రిటికల్ ఎనాలసిస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2025 కార్యక్రమం

సీతం లో ఏ క్రిటికల్ ఎనాలసిస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2025 కార్యక్రమం

న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో ఉన్న సీతం కళాశాలలో గురువారం ఏ క్రిటికల్ ఎనాలసిస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2025” అనే అంశంపై
అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చార్టెడ్ అకౌంటెంట్లు ఎమ్.రామా రావు, జీ.మారుతీ రాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ (బీ.బీ.ఏ) , పిజి (ఎమ్.బీ.ఏ) విద్యార్థులకు బడ్జెట్ ఆవశ్యకతను, విశ్లేషణ చేయడం ద్వారా భారత దేశ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలను తెలిపారు. దేశ ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందిన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రత్యేకంగా ఫోర్ ఇంజన్స్ అనే కొత్త అంశం ద్వారా వ్యవసాయం , ఎమ్. ఎస్.ఎమ్.ఈ , ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి వాటి పై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. యూనియన్ బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను మినహాయింపు థ్రెషోల్డ్‌ను ఐ ఎన్ ఎఫ్ 12 లక్షలకు పెంచడం ద్వారా మద్య తరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా ఉందన్నారు.
అదేవిధంగా నారీ శక్తి ద్వారా దేశంలో మహిళా సాధికారతకు, స్వయం ఉపాధికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. స్టార్టప్స్ , ఇన్కమ్ టాక్స్ , వికసిత్ భారత్ , మేక్ ఇన్ ఇండియా , రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మైనింగ్ , రూరల్ డెవలప్మెంట్ , రక్షణ వంటి అనేక రంగాలలో కేటాయించిన నిధులు , వాటి ద్వారా వచ్చే ఆదాయ విషయాలను వివరించారు.ఈ సందర్భంగా సీతం కళాశాల డైరెక్టర్ ఎం శశిభూషణ్ రావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులకు యూనియన్ బడ్జెట్ లాంటి అంశాలను తెలియజెప్పడం ఎంతో అవసరమన్నారు. ఆర్థిక ప్రణాళిక , నిర్వహణ , పన్నులు పన్నుయేతర వనరుల నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు గూర్చి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు ఆర్థిక క్రమశిక్షణను నేర్చుకుంటారన్నారు .
కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.వి.రామమూర్తి మాట్లాడుతూ ఈ అంశం ద్వారా విద్యార్థులు పన్ను మరియు సంస్కరణలు ద్వారా వ్యాపారాల పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ( ఎఫ్డిఐ ), దేశం యొక్క స్టాక్ మార్కెట్లు వంటి అంశాలు పై విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామం అన్నారు.
ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ హెచ్.ఓ.డీ డాక్టర్ యస్ వరూధిని మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ, స్వయం ఉపాధి, అణగారిన వర్గాల అభివృద్ది వంటి అంశాలపై అవగాహన కల్పించడం మంచిదన్నారు. స్టార్టప్స్ ద్వారా నేటి యువతకు స్వయం ఉపాధి అవకాశాలను ఎలా అందుకోవాలో తెలియజేయడం మంచి విషయమన్నారు.ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతం లో ఏ క్రిటికల్ ఎనాలసిస్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2025 కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics