వినుకొండలో రథసప్తమి వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రధాన అర్చకులు శ్రీనివాసులు, శ్రావణ కుమార్, మరియు పట్టణ పురోహితులు యడవల్లి శ్రీనివాస శర్మ, వేద పండితులచే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవ్వేతంగా కనులు పండగగా ఆలయ మాడవీధుల నందు గరుడ ఆలవారు మీద స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనుల పండగ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సత్య సాయి మహిళా భక్తులు, స్వామివారి సేవా దళ మహిళా భక్తులు మరియు మహిళలచే కోలాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రెడ్డి. బంగారయ్య, సెక్రటరీ అచ్యుత. కృష్ణ సుబ్బయ్య, ట్రెజరర్ కాళ్ళ. రామకోటేశ్వరరావు, గుడిపాటి. కోటేశ్వరరావు, అన్న. బ్రహ్మం, మోటమర్రి. నాగేశ్వరరావు, వాసు, ఆదినారాయణ ,తదితరులు పాల్గొని ఉత్సవ ఊరేగింపు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. (Story: వినుకొండలో రథసప్తమి వేడుకలు)