మావోయిస్టు డంపు కనుగొన్న భద్రతా బలగాలు
న్యూస్‌తెలుగు/చింతూరు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా లో పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలు మావోయిస్టు బారీ డంపు ను 203 కోబ్రా బెటాలియన్ మరియు 131 బెటాలియన్ సిఆర్పిఎఫ్ జాయింట్ ఆపరేషన్ లో సుక్మా జిల్లాలోని మెటగూడెం – దులేర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ సామగ్రి వెలికి తీశారు.203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, 131 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఎ మరియు డి కంపెనీలతో పాటు, ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను అనుసరించి విస్తృతమైన శోధన ఆపరేషన్ నిర్వహించింది. సెర్చ్ పార్టీ మెటగూడెం గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహ దాగిన స్థలాన్ని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధశాలలో సబ్బు కేసుల్లో ప్యాక్ చేసిన 21 ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాలు (ఐ ఈ డి లు), మల్టిపుల్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (బి జి యల్ ) బాంబులు, ఒక జనరేట్ ఉన్నాయి.ఈ డంపు ను కనుగొన్న బలగాలను ఉన్నతధికారులు అభినందిచారు. (Story : మావోయిస్టు డంపు కనుగొన్న భద్రతా బలగాలు)