శర్మ స్కూలు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిభిరం
న్యూస్ తెలుగు/వినుకొండ : శర్మ స్కూలు వారి ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ ఎం వి రెడ్డి కంటి వైద్యశాల వారి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని వెల్లటూరు రోడ్ లో గల శర్మ స్కూల్ నందు 21 మరియు 22, తేదీలలో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని శర్మ స్కూల్ కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ అయిన వి.వి శర్మగారు ప్రారంభించారు. ఈ శిబిరంలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి విజన్ ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ శిబిరములో శర్మ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ పిల్లలందరినీ మరియు స్టాప్ ను సుమారుగా 535 మందిని పరీక్షించడం జరిగింది. వీళ్లలో సుమారుగా 84 మంది కంటి చూపు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి రాయితీపై డాక్టర్ ఎం వి రెడ్డి ఐ హాస్పిటల్ నందు కళ్ళజోళ్ళు, చుక్కల మందులు, కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ శిబిరంలో ఎం వివేకానంద రెడ్డి మాట్లాడుతూ పిల్లలు పెద్ద పెద్ద స్క్రీన్లు మొబైల్స్ వాడటం వలన బాగా కంటి సమస్యల తలెత్తుతున్నాయని, మీరు ఆకుకూరలు, పాలు, గుడ్డు, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్ శర్మ మాట్లాడుతూ మా స్కూల్ నందు కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల, జిల్లాల నుంచి విరివిగా వచ్చే పిల్లలకు తరచూ ఇలాంటి ఐ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ మా స్కూల్ నిర్వహిస్తామని వారికి ఎలాంటి వైద్య సేవలకు వెనుకాడమని వారి యొక్క ఆరోగ్య భద్రత మా బాధ్యతని ఐ క్యాంప్ నిర్వహించిన ఎం. వి.రెడ్డి హాస్పిటల్ని అభినందించారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది స్కూల్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.(Story : శశర్మ స్కూలు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిభిరం )