పెబ్బేరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన చెలిమిళ్ళ ప్రీమియర్ లీగ్ (CCL) క్రికెట్ పోటీల విజేతలకు ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బహుమతి ప్రధానోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే కాసేపు క్రీడాకారులతో క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహపరిచారు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కార్యాలయం PJP ప్రక్కనగల క్రీడా మైదానంలో శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి మాత ఉత్సవాల సందర్భంగా నిర్వహించే పెబ్బేర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను (PPL) ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులతో ఆటలాడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలను అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని గెలుపు ఓటములు ప్రతి ఒక్కరికి సహజమని ఓటమి చెందిన వారు మరింత కసిగా ఆడి వారి వారి ప్రతిభను నిరూపించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు శివ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కేకును కోసి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పెబ్బేరు మండల కేంద్రానికి చెందిన RMP డాక్టర్ వేణుగోపాల్ ఇటీవల గుండెకు శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధితుది ఆదివారం ఇంటికి వెళ్లి పరమార్శించారు. పెబ్బేరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ స్థలంలో నూతనంగా నిర్మించిన వాలీబాల్ క్రీడ మైదానాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. వాలీబాల్ క్రీడాకారులతో కొంతసేపు ఆట ఆడారు క్రీడలతో జాతీయ స్థాయి గుర్తింపును పొందవచ్చునని, యువకులు ఉన్నత విద్య ఉపాధితో పాటు క్రీడలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పెబ్బేరు మండల కేంద్రంలోని 1వ వార్డు కౌన్సిలర్ అక్కమ్మ భర్త మంద బాబు గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ఇటీవలే శస్త్ర చికిత్స చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి ఇబ్బందున్న తన దృష్టికి తీసుకురావాలని అన్ని విధాల తను అండగా ఉంటారని అక్కమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు ఎల్ల స్వామి అశ్విని సత్యనారాయణ అక్కమ్మ, నాయకులు రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ యాపర్ల రాంరెడ్డి, రాముల యాదవ్ చెలిమిళ్ళ రాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : పెబ్బేరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన )