పోలీస్ వాహనం పేల్చి వేసిన మావోయిస్టులు
ఒక డ్రైవర్ 8 మంది డి ఆర్ జి జవాన్ల మృతి
న్యూస్ తెలుగు/చింతూరు : చతిస్గడ్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 2.30 మావోయిస్టులు పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందు పాత్ర పేల్చివేశారు. ఈ ఘటనలోఒక డ్రైవర్, 8 మంది డి ఆర్ జి జవాన్ లు మృతి చెందారు. మరో ఏడుగురుకు గాయాలయ్యాయి. గాయాలైన వారినిబైజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే డి ఆర్ జి జవాన్లు, సిఆర్పిఎఫ్ బలగాలు నారాయణపూర్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత కూంబింగ్ గత మూడు రోజులు నిర్వహించారు. శని, అది వారాల్లో 5 మావోయిస్టులను హతమార్చారు. కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రానికి వస్తుండగా కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలో బేదిరే గ్రామ సమీపంలోకి రాగానే ఒక వంతెన వద్ద మావోయిస్టులు డి ఆర్ జి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందు పాత్రతో పేల్చి వేశారు. మందు పాత్ర ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం గాలిలోకి ఎగిరి తునాతునకలై అయిపోయింది. ఈ ఘటనలో ఒక డ్రైవరు, 8 మంది డి ఆర్ జి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురుకీ తీవ్ర గాయాలయ్యాయి.వారిని బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భస్తర్ ఐజి పి సుందర్ రాజ్ ధ్రువీకరించారు. (Story : పోలీస్ వాహనం పేల్చి వేసిన మావోయిస్టులు)