బాధిత కుటుంబానికి 5వేల రూపాయలు
జెకె సిటీ వితరణ
న్యూస్తెలుగు/చింతూరు : మండలంలోని సరివెల గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన మొర్రం రాజయ్య 55. బాధిత కుటుంబానికి చింతూరు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఐదువేల రూపాయలను బాధిత కుటుంబానికి మంగళవారం అందజేశారు. కుటుంబ పెద్ద మృతి చెందడం పట్ల ఆ కుటుంబం ఎన్నో ఇబ్బందులకు గురవుతుందని అటువంటి కుటుంబానికి ఆసరాగా తోచివిధంగా సహాయం చేసి ఆదుకోవాలని ఉద్దేశంతోటే జై కే సి టి ట్రస్ట్ ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ట్రస్ట్ సభ్యులు ఎస్కే రియాజ్, గ్రామ పెద్దలు ముత్యాల శ్రీరామ్. పొదిలి రామారావు తదితరులు పాల్గొన్నారు. (Story : బాధిత కుటుంబానికి 5వేల రూపాయలు జెకె సిటీ వితరణ)