ఘనంగా చిక్కుడుకాయలు పండుగ
న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం, చిన్నర్కూర్ గ్రామంలో ఆదివాసీలా సంప్రదాయ పండుగలలో ఒకటైన చిక్కుడు కాయల సోమవారం పండుగను ఘనంగా చేశారు.ఈ పండుగకు మొదట గ్రామ ముత్యాలమ్మ దేవుడికి నీళ్లు పోసి సుద్ది చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన తరవాత ఊర్లో బుదే ముసలి ని మట్టితో తయారు చేసి గంపలో పెట్టి ప్రతి ఇంటికి వెళ్లి కర్రలతో ఇంటిని కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతారు. అలా ఇళ్లను కొట్టడం వలన ఆ ఇంట్లో ఉండే చీడ చిక్కులు పోతాయని ఆదివాసులు నమ్మకంగా భావిస్తారు.ఆ గంపలోని దేవుడిని ఊరంతా తిప్పిన తరవాత ఊరి పొలిమేరలో పెట్టేసి వచ్చిన తరవాత ఎవరి ఇళ్లలో కోళ్లు కొబ్బరికాయలు, చిక్కుడు కాయలు నైవేద్యం గా దేవుడికి ఇచ్చిన తరవాత అప్పటి నుంచి చిక్కుడు కాయలు తింటారు.ఈ పండుగకు బంధువులను పిలిచి సంప్రదాయగా భోజనాలు పెట్టి పంపు తారని ఆ గ్రామస్తులు చెప్పుకొచ్చారు. (Story : ఘనంగా చిక్కుడుకాయలు పండుగ)