ఐ టి డి ఏ పి ఓ ఆకస్మిక పర్యటన
న్యూస్‌తెలుగు/చింతూరు : కూనవరం మండలంలో నీ కాచవరం ఎంపీపీఏస్ స్కూల్ ను ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుల కొరత గురించి పిల్లల తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సమస్యను వీలు అయి అంత త్వరగా పరిష్కరించడం జరుగుతుంది అని పిల్లల తల్లి దండ్రులు ఉద్దేశించి మాట్లాడి న్నారు. తదుపరి కూనవరం మండలం గ్రామ పంచాయతీ ముందు ఉన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కు ముంపుకు గురి అవుతున్న ఇళ్ల యొక్క స్ట్రక్చరల్ వాల్యుయేషన్ స్వయంగా ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు. అదే విధంగా కూనవరం ప్రజలతో మాట్లాడుతూ ఇళ్ల సర్వే లో తేడాలు వచ్చిన ఇళ్ల ను మరల సర్వే చేయించడం జరుగుతుందని, సర్వే కానీ వాళ్లకు త్వరలో ఇళ్ల సర్వే చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పినారు. ఇళ్ల సర్వే తో పాటు చెట్లు, ఇతర కట్టడాల వాల్యుయేషన్ పని కూడా మొదలు పెట్టడం జరుగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ (ఏస్ డి సి) రవితేజ ,( డి ఇ) , పి ఆర్, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.తదుపరి కోతుల గుట్ట కేజీవీవీ స్కూల్ ను సందర్శించి స్కూల్ పరిసరాలను పరిశీలించారు.(Story : ఐ టి డి ఏ పి ఓ ఆకస్మిక పర్యటన)