హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని
జయప్రదం చేయండి
మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్
న్యూస్ తెలుగు /వినుకొండ : హలో మాల చలో గుంటూరు కార్యక్రమం భాగంగా సాయంత్రం 4 గంటలకు నల్లపాడులో జరుగు మాలల సింహగర్జన కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గం లోని మాలలు అందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సి వర్గీకరణకు తీర్పుటకు వ్యతిరేకంగా మాల అందరూ కదలి రావాలని పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి రాయని చిన్న, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు పమిడిపల్లి ఇజ్రాయిల్, గౌరవసలహాదారుడు కొమ్మ తోటి కృపాయ, ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షులు కనమాల అంకారావు, వినుకొండ మండల అధ్యక్షులు పిడతల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పిడతల రాజా, పల్లపాటి భాస్కర్, అంబడపూడి శ్రీను, పెనుమాల రమేష్, బిల్లా ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. (Story : హలో మాల చలో గుంటూరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి)