గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : డిసెంబర్ 15, 16 ఆదివారం, సోమవారం నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ వివరిస్తూ ఉదయం 10 నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 5.30 వరకు నిర్వహించే గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు నిర్ణీత సమయం అంటే ఉదయం 9.30 మధ్యాహ్నం అయితే 2.30 కి నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతి ఉండదని తెలియజేశారు. సమయానికి చేరుకునేలా ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాలను చూసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని అర్థంచేసుకుని పాటించాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డు ఒరిజినల్ గుర్తింపు కార్డు మాత్రమే తీసుకొని రావాలని కలర్ జీరాక్స్ కాపీ తెచ్చిన చెల్లదని తెలియజేశారు. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డు తప్ప మరే విధమైన వస్తువులు పరీక్ష కేంద్రంలోకి తీసుకురావడానికి అనుమతి లేదు. సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పేజర్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, గడియారం, గణిత టేబుల్, లాగ్ పట్టికలు, పర్స్, పరీక్ష ప్యాడ్ , నోట్ బుక్స్ లేదా విడి పేపర్లు, ఆభరణాలు (మంగళ సూత్రం, గాజులు తప్ప) హ్యాండ్ బ్యాగులు, పౌచ్ లు తీసుకొని రావద్దని వాటిని ఎట్టిపరిస్థిల్లోనూ అనుమతించేది లేదన్నారు. ఒకవేళ డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ బ్లర్ గా ఉన్న, ఫోటో సరిగ్గా కనిపించకపోయినా (3) పాస్పోర్ట్ సైజ్ ఫోటో లతో వెబ్సైట్ లో పెట్టిన ప్రోఫార్మ లో అండర్ టేకింగ్ లెటర్ పై గెజిటెడ్ అధికారి సంతకం తీసుకొని రావాల్సి ఉంటుందని తెలియజేశారు.
దివ్యాంగులు పరీక్ష రాసేందుకు స్క్రయిబ్ అర్హత కలిగిన వారు తప్పనిసరిగా సదరం సర్టిఫికెట్ చీఫ్ సూపరిండెంట్ కు చూపించాల్సి ఉంటుందని చెప్పారు. (Story : గ్రూప్ 2 అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి)