అంగన్వాడీల బలోపేతంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
న్యూస్ తెలుగు/వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి పెద్దపీట వేసిందని ఈ క్రమంలో వనపర్తి జిల్లా పరిధిలోని 364 అంగన్వాడి కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు, టేబుల్స్, విద్యార్థులకు పాఠశాల దుస్తులు ఇలాంటి సమస్య లేకుండా ముందస్తుగానే అందజేసిందని ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి మండలం కందిరీగ తండాలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అంగన్వాడి మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు, దుస్తువులు పాఠ్యపుస్తకాలు కేంద్రానికి టేబుల్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నామని గ్రామీణ స్థాయిలోనే జాతీయస్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, ఈ కార్యచరణ ఫలితమే ప్రతి మండలంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్బులని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి సిడిపిఓ హజీరా, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : అంగన్వాడీల బలోపేతంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి )