అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్
న్యూస్ తెలుగు/విజయనగరం : తోటపాలెంలో నాలుగు ఇండ్లలో ఆగష్టు మాసంలో దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతరాష్ట్ర దొంగను డిసెంబరు 5న అరెస్టు చేసి, అతని వద్ద నుండి 400 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేసినట్లుగా వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. పట్టణం తోటపాలెంలో ఆగష్టు 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.ఈ కేసుల్లో సాంకేతిక ఆధారాలు ఆధారంగా నేరంకు పాల్పడిన వారు మధ్యప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఐదా ఈదు బఘెల్ డిసెంబరు 4న రాత్రి విజయనగరం పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సీసీఎస్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు బృందం నిందితుడిని అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు.విచారణలో ఐదా ఆగస్టు మాసంలో తన గ్యాంగుతో మధ్యప్రదేశ్ నుండి విజయనగరం వచ్చి తోటపాలెం ప్రాంతంలో నాలుగు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. అరెస్టు కాబడిన నిందితుడి వద్ద నుండి 400 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేసి, రిమాండుకు తరలించినట్లు వన్ టౌన్ సిఐ ఎస్. శ్రీనివాస్ తెలిపారు.నిందితుడిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులతో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.నిందితుడిని అరెస్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన ఎస్సై సురేంద్ర నాయుడు, హెచ్.సి.లు అచ్చిరాజు, శంకరరావు, ఇమ్రాన్ ఖాన్, కానిస్టేబుళ్లు శ్రీను, మణికంఠ లను వన్ టౌన్ సిఐ శ్రీనివాస్, సీసీఎస్ సిఐ సత్యనారాయణలు అభినందించారు.(Story : అంతరాష్ట్ర దొంగ అరెస్టు)