శ్రీ బాలాజీ ఐటిఐ లో ఘనంగా జరిగిన
18వ స్పోర్ట్స్ మీట్
న్యూస్‌తెలుగు/వినుకొండ : పట్టణ సమీపంలో ఉన్న శ్రీ బాలాజీ ఐ టి ఐ కళాశాలలో సంకురాత్రి కృష్ణయ్య- గంగమ్మ ల జ్ఞాపకార్థం గా సంకురాత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గురువారం 18 వ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ కర్రి వెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన దూర దర్శన్ ఏ ఈ. రవికుమార్ , మహా టీవీ రిపోర్టర్ సాంబశివరావు సభలోని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ. క్రీడలు శరీరానికి వ్యాయామం తో పాటుగా మానసికంగా ఉత్సాహాన్నిస్తాయని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రతిఒక్క విద్యార్థి తమ తల్లి దండ్రులను గౌరవించాలని, వాళ్ళని వృద్దాప్యంలో ఆదరించాలని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, రన్నింగ్, డిబేట్, ఎస్సే రైటింగ్, కబడ్డీ, షటిల్,షాట్ పుట్ క్రీడలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి షీల్డ్స్, బహుమతులు, పుస్తకాలను ప్రదానం చేసారు. గత విద్యా సంవత్సరానికి ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన గోనేపల్లి కేశవ రాజు, మేరాజ్యోతు వాగ్యానాయక్, ఒంటేరు నరేంద్ర, సంజీవ్ నాయక్ లకు ఒక్కొక్కరికి 1116/- నగదుమరియు షీల్డ్స్ అందించటం జరిగింది .ఈ కార్యక్రమంలో దూరదర్శన్ నుండి య స్. కోటేశ్వరరావు, కాలేజీ కరెస్పాండంట్ శ్రీమతి సంకురాత్రి జానకి , కళాశాల సిబ్బంది, సంకురాత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : శ్రీ బాలాజీ ఐటిఐ లో ఘనంగా జరిగిన 18వ స్పోర్ట్స్ మీట్)