మహిళల పరువు హత్యలు, హత్యాచారాలపై పోరాడాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : రాష్ట్రంలో పరువు హత్యలు, హత్యాచారాలపై పోరాడాలని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, గీత, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి ఆఫీస్ లో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాల మల్లేష్ మృతి సందర్భంగాసంతాప సమావేశం నిర్వహించారు. బాల మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపూర్ లో పోలీస్ కానిస్టేబుల్ కొంగర నాగమణి కులాంతర వివాహం చేసుకుందని పరువు పేరుతో సొంత తమ్ముడు హత్య చేయటం దుర్మార్గమని ఖండించారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కులాంత వివాహం చేసుకున్న కూతుళ్లను కుటుంబ సభ్యులు దారుణంగా చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు బాలికలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని కేసులు నమోదవుతున్న శిక్షలు మాత్రం పడటం లేదన్నారు. అందువల్ల నే మహిళలపై నేరాలు తగ్గటం లేదన్నారు. అందువల్ల మహిళా నేరాలు తగ్గటం లేదన్నారు. బలమైన సాక్షాలతో నేరస్తులకు శిక్షలు పడేవిధంగా పోలీసులు కృషి చేయాలన్నారు. కుటుంబంలో ఆడపిల్లల పట్ల వివక్ష పోవాలన్నారు. వారి ఎదగటానికి అవకాశాలు కల్పించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు ఇవ్వాలన్నారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లు షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై పోరాడేందుకు మహిళా శక్తిని సంఘటితం చేయాలన్నారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్లు భూమిక, శిరీష సిపిఐ నాయకులు రమేష్, శ్రీరామ్, గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.(Story : మహిళల పరువు హత్యలు, హత్యాచారాలపై పోరాడాలి )