శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను కార్యకర్తలలాగ పనిచేయిస్తున్న ప్రభుత్వం
రైతులు ముఖం చాటేయడంతో పోలీస్ భద్రత నడుమ మహిళల తరలింపు
న్యూస్ తెలుగు/వనపర్తి : రైతు పండగ సంబరాల పేరిట అమిస్తాపూర్ నందు నిర్వహిస్తున్న రైతు సదస్సుకు రైతులు రానేరాము అని ఖరాఖండిగా చేపడమే గాక గ్రామాలలో రైతు సదస్సు గురించి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయడానికి వచ్చిన ప్రచార రథాలను ఎక్కడి అక్కడ అడ్డుకొని ప్రభుత్వంపై దుమ్ము ఎత్తి పోయడంతో దిక్కుతోచని ప్రభుత్వం పోలీస్ పహార నడుమ మహిళలను బలవంతంగా తరలించడం ఈ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని జిల్లా బి.ఆర్.ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ ఆరోపించారు. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను వాగ్దానాల మత్తులో ముంచి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి రైతులను,మహిళలను,నిరుద్యోగులను, వయోవృద్దులను,కార్మికులను,కౌలు రైతులను గాలికి వదిలేసి కేవలం కమిషన్లు వచ్చే మూసీనది ప్రక్షాళన,ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూముల సేకరణ చేయడాన్ని నందిమల్ల.అశోక్ తీవ్రంగా ఖండించారు. రైతుల రుణ మాఫీ ఎగ్గొట్టి రైతు భీమా ఎగ్గొట్టి రైతు భరోసా ఎగ్గొట్టి కౌలు రైతుల రైతు భరోసా ఎగ్గొట్టి రైతు కూలీల రైతు భరోసా ఎగ్గొట్టి దాన్యంపై 500బోనస్ ఎగ్గొట్టి ధాన్యం కొనుగోలు ఎగ్గొట్టి ఏ మొఖం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తున్నారు ప్రజలకు చెప్పాలని నందిమల్ల.అశోక్ డిమాండ్ చేశారు. మహిళలు తమకు ఇస్తామన్న 2500 ఏ గ్గొట్టినందుకు తొలం బంగారం ఎగ్గోట్టినందుకు గ్యాస్ సబ్సిడీ ఎగ్గొట్టినందుకు కె.సి.ఆర్ కిట్టు ఎగ్గొట్టినందుకు విద్యార్థినులకు స్కూటీలు,ల్యాప్ టాప్ లు యెగ్గోట్టినందుకు మహిళలు కూడా సభకు రావాడినికి సుముఖంగా లేకపోవడంతో మహిళా సంఘాల అధికారులకు, పోలీసులకు టార్గెట్ ఇచ్చి తరలించడం విడ్డూరంగా ఉంది అని నందిమల్ల.అశోక్ అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కాని పోలీస్ వ్యవస్థను శాంతి భద్రతలు కాపడానికి,సభలకు,సమావేశాలకు భద్రత కల్పించడానికి ఉపయోగించుకున్నారు కానీ ఈ విధంగా ముఖ్యమంత్రి సమావేశానికి ప్రజలను తరలించడానికి ఉపయోగించలేదని దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని నందిమల్ల.అశోక్ కోరారు.ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని పొందాలని హితవు పలికారు.ఖండించిన వారిలో సూర్యవంశపు.గిరి, చిట్యాల.రాము,హేమంత్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.(Story : శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను కార్యకర్తలలాగ పనిచేయిస్తున్న ప్రభుత్వం)