UA-35385725-1 UA-35385725-1

కౌన్సిల్ సమావేశాలకు సభ్యులు విధిగా హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తాం

కౌన్సిల్ సమావేశాలకు సభ్యులు విధిగా హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తాం

మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి

న్యూస్ తెలుగు/వినుకొండ : మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు వరుసగా మూడు సమావేశాలకు హాజరు కాకపోతే నిబంధనలకు అనుగుణంగా సభ్యులను సస్పెండ్ చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి హెచ్చరించారు. శుక్రవారం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. చైర్మన్ మరియు మున్సిపల్ అధికారులు 11 గంటలకే సమావేశానికి హాజరు కాగా 12 గంటల వరకు కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 32 మంది కౌన్సిలర్లు ఎక్స్ ఫిషియో సభ్యులు ముగ్గురు ఉండగా కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం మరో ఇద్దరు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే 8వ వార్డు కౌన్సిలర్ పి .బ్రహ్మయ్య మాట్లాడుతూ. సమావేశాలకు హాజరైన ఫలితం ఏముంటుంది మా వార్డుల సమస్యలు పరిష్కరించడం లేదు కదా అని ప్రశ్నించారు. దీంతో చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ. సమావేశాలకు విధిగా హాజరు కావాలని, వరుసగా మూడు సమావేశాలకు కౌన్సిల్ సభ్యులు హాజరు కాకపోతే వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని ఆగ్రహిస్తూ హెచ్చరించారు. దీంతో ఇరువురు మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. కౌన్సిల్ సమావేశాలకు విధిగా సీసీ కెమెరాలు ఫుటేజీ తప్పనిసరిగా పనిచేసే విధంగా చూసి వాటిని భద్రపరచాలని చైర్మన్ కమిషనర్ను కోరారు.. గత సమావేశంలో మున్సిపల్ కౌన్సిల్ స్టాండింగ్ లీగల్ సభ్యులుగా ఏడుగురు దరఖాస్తు చేసుకుంటే కౌన్సిల్ తీర్మానం లేకుండా ఒకరిని ఎలా ఎంపిక చేశారని సభ్యులు బ్రహ్మయ్య ప్రశ్నించారు. దీంతో చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ. ఎమ్మెల్యే జీవీ,ఆంజనేయులు సూచనల మేరకు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఒకరిని ఎంపిక చేయడం జరిగిందని, మీరు కౌన్సిల్ తీర్మానం చేసి పెట్టండి మరల నియామకం జరుపుదాం అంటూ దీటుగా సమాధానం ఇచ్చారు. దీంతో కౌన్సిల్ సభ్యులు బ్రహ్మయ్య నోరు మెదపలేదు. వైసిపి హయాంలో గత నాలుగేళ్లుగా మీరు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడగలేదు అంటూ చైర్మన్ కౌన్సిల్ సభ్యులను ప్రశ్నించారు. దీంతో బ్రహ్మయ్య మాట్లాడుతూ. వైసీపీ సభ్యులంతా కలిసే కదా మిమ్మల్ని చైర్మన్ గా ఎన్నుకుంది అంటూ బదులిచ్చారు. అజెండాలో మొత్తం 64 అంశాలు ఉండగా చివరి 64వ అంశం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు వాటిపై ఈ అంశాన్ని రద్దుచేస్తూ మిగతా 63 అంశాలను సమావేశం ఆమోదించినట్లు చైర్మన్ ప్రకటించారు. 32 వ వార్డు కౌన్సిలర్ టిడిపి వాసిరెడ్డి లింగమూర్తి మాట్లాడుతూ. వార్డుల్లో ఏ పనులు జరగడంలేదని అన్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని అధికారులు సమాధానం ఇచ్చారు. 17వ వార్డు కౌన్సిలర్ భాష మాట్లాడుతూ. ఇటీవల కాలంలో వార్డు సమస్యలపై ఫోన్ చేయగానే అధికారులు వెంటనే స్పందిస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ. 15వ ఆర్థిక సంఘం నిధులతో సిసి రోడ్లు తదితర పనులు పెట్టారా లేదా అని ప్రశ్నించారు. ముస్లిం స్మశాన వాటికలో ఆరు విద్యుత్ పోల్స్ ఉన్నప్పటికీ ఒక్క లైట్ కూడా వెలగని కారణంతో ప్రొద్దుపోయినప్పుడు ఖననం చేసే సమయాలలో ముస్లిం సోదరులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే లైట్లు వేయించాలని కోరారు. అలాగే హిందూ స్మశాన వాటికలోకి వెళ్లే క్రమంలో ఆ ప్రాంతంలో ఆక్రమణలు ఉన్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని కూడా భాష అధికారుల దృష్టికి తెచ్చారు. కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ. ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా గత కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ దస్తగిరి సమాధానం ఇచ్చిన తీరు. నేడు సభ్యులకు ఇచ్చిన సమాధానం తీరు. చాలా భిన్నంగా కనబడింది. ఎట్టకేలకు సమావేశం ప్రశాంతంగా ముగిసింది.(Story : కౌన్సిల్ సమావేశాలకు సభ్యులు విధిగా హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1