కళాసాగరి కార్యక్రమాలు భగవద్గీత లా పవిత్రంగా ఉన్నాయి
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా సాంస్కృతిక కార్యక్రమాలతో పేరుతో చేస్తున్నది అస్లీల నృత్యాలేనని కళాసాగరి కార్యక్రమాలు అటు అస్లీలతకు తావు లేకుండా భగవద్గీత లా పవిత్రంగా మనసుకు ఆనందం ఆహ్లాదం కలిగించే విధంగా ఉన్నాయని, ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జునరావు అన్నారు. కళాసాగరి ట్రస్ట్ రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ సంయుక్తంగా నిర్వహించిన ఘంటసాల గానామృతం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక మండల ఆఫీస్ వద్ద జరిగిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. రోటరీ జిల్లా 3150 మాజీ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ. రోటరీ సేవా కార్యక్రమాలతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొందించే ఇటువంటి కల్చరల్ ఈవెంట్స్ ని వినుకొండ క్లబ్ వారు తీసుకొని నిర్వహించడం ముదావహం అని అన్నారు. జనసేన పార్టీ ఇంచార్జి నాగశ్రీను రాయల్, బీజేపీ నాయకులు మేడం రమేష్, ప్రముఖ అడ్వకేట్ మూర్తి తదితరులు అతిధులుగా సభలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం “కళాసాగరి ఘంటసాల స్మారక అవార్డు” ను ఒంగోలు కు చెందిన కొమ్ము విజయ్ కుమార్ పూర్ణిమ దంపతులకు, “కళాసాగరి సేవ ప్రపూర్ణ” అభినందన సత్కారాన్ని పి. వి. సురేష్ బాబుకు అందించి వారిని ఘనంగా సత్కరించారు. చిరుమామిళ్ల కోటేశ్వరరావు, గుమ్మా శ్రీకాంత్ రెడ్డి, గుత్తా గురునాధం, యేరువ వెంకట నారాయణ, నాయబ్ రసూల్, షేక్ మస్తాన్ వలి లకు రోటరీ గౌరవ సత్కారాలు అందించి సన్మానించారు. కార్యక్రమానికి సీనియర్ రోటరీ ఎక్సిక్యూటివ్ ఆలా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కళాసాగరి సభ్యులు సదాశివరావు, సూరె నాగేశ్వరరావు బీరెళ్ల వెంకటేశ్వర్లు, జవ్వాజి వెంకటరావు, అదిరాములు, నూతలపాటి బాల ప్రసాద్ కళాసాగరి కార్యదర్శి కోటేశ్వరరావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సుమిత్ర కుమార్, ఒంగోలు సెంట్రల్ క్లబ్ కార్యదర్శి సురేంద్ర, మహిళా రోటరియన్లు విజయలక్ష్మి లీల రెడ్డి . మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కళాసాగరి వ్యవస్థాపకులు కూచి రామాంజనేయులు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు.(Story : కళాసాగరి కార్యక్రమాలు భగవద్గీత లా పవిత్రంగా ఉన్నాయి)