వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సత్య డిగ్రీ కళాశాలకు రన్నర్స్ గా టీం చాంపియన్షిప్
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : సత్య డిగ్రీ, పీజీ కళాశాలకు ఆంధ్ర యూనిర్సిటీ అంతర కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ పోటీలలో టీం చాంపియన్షిప్ లో రన్నర్స్ గా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి తెలియజేశారు. ఈ పోటీలు విశాఖపట్నం లంకపల్లి బుల్లయ్య కాలేజ్ లో నవంబర్ 2 వ తేదీన జరిగాయి. ఈ పోటీలలో విద్యార్థులు సాధించిన పతకాలు ఏ. యశశ్రీ ఫస్ట్ ఇయర్ బి.య్యే 64కెజీలు విభాగం లో (స్నాచ్) బంగారు పతకం, ఎస్. పల్లవి సెకండ్ ఇయర్ బియ్యే 71 కేజీల విభాగంలో (స్నాచ్) బంగారు పతకం , బి.నీరజ ఫస్ట్ ఇయర్ బియ్యె 45 కేజీల విభాగంలో (స్నాచ్) బంగారు పతకం , ఆర్. రాoబాబు సెకండ్ ఇయర్ బీయే 96 కేజీల విభాగంలో (స్నాచ్) బంగారు పతకం , ఏ. లిఖిత్ ఫస్టు ఇయర్ బియే 67కేజీల విభాగము లో (శ్నాచ్) రజిత ప త కాలు సాధించారు
ఈ విద్యార్థులు నవంబర్ మూడవ వారం లో జరగబోయే సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్శిటీ పోటీలలో పాల్గొంటారు.ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు అభినందన సభలో మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు వారు ఎంచుకున్న రంగంలో మిక్కిలి నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరుతూ విద్యార్థులకు నగదు బహుమతి మరియు జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ సి సి ఆఫీసర్ ఎం ఉదయ్ కిరణ్, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ బి సూరపు నాయుడు, ఫిజికల్ డైరెక్టర్లు మహేష్, ప్రసాద్, కోచ్ చల్లా రాము పాల్గొన్నారు. (Story : వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో సత్య డిగ్రీ కళాశాలకు రన్నర్స్ గా టీం చాంపియన్షిప్)