చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే కల్పించాలి
బీసీ హక్కుల రాష్ట్ర సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు బీసీ
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి
న్యూస్ తెలుగు /ములుగు,జిల్లా బ్యూరో(వరంగల్ )(వై. లకుమయ్య ) : సమాజంలో తరతరాలుగా వివక్షతకు అణచివేతకు పీడనకు ఆర్థిక వెనుకబాటుతనానికి గురి అవుతున్న,, బిసి తరగతులకు చట్టసభలలో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని,స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, బిసి హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంటకట రాములు డిమాండ్ చేశారు.కల్పించి రాజకీయంగా అవకాశాలు కల్పించి వెనుకబడిన కులాల్ని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని శనివారం అహన్మకొండ కలెక్టరేట్లో బీసీ కమిషన్ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పాల్గొని డిమాండ్స్ పత్రాన్నిఆయన సమర్పించి మాట్లాడుతూ రాజకీయంగా అవకాలు కల్పించి,, వెనుక బడిన కులాల్ని దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం చేయాలన్నారు. దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతూ, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా భాగస్వాములుగా కాకుండా, పాలకులు తీవ్ర వివక్షతతో చూడడం మూలంగా, అన్ని రంగాల్లో వెనుకబడిన బీసీ వర్గాలను, తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగినది రాష్ట్రంలో కుల గణన సమగ్రంగా నిర్ణీత కాలంలో చేసి, అన్ని కులాల లెక్కలు తేల్చి, ఆ కుల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని, విదేశీ విద్య పధకానికి చెల్లిస్తున్న,ఇరవై లక్షలని,30 లక్షలకు పెంచి,బకాయిలను వెంటనే విడుదల చేసి, విదేశీ విద్యను ఆర్థిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులను ఆదుకోవాలని, జీవో నంబర్ 28 నే రద్దు చేసి, బీసీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని, జనాభా ఆధారితంగా బడ్జెట్లు కేటాయించాలని బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి ఎస్సీ ఎస్టీ తరహా అట్రాసిటీ చట్టాన్ని చేసి అమలు పరచాలన్నారు.చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ దేశ జనగణంలో కులగనను కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు, రాష్ట్రము ఒత్తిడి చేయాలని రిజర్వేషన్ కేటగిరిలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును ప్రభుత్వమే భరించాలన్నారు., ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.(Story:చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే కల్పించాలి)