Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌క్రీడాల్లో ఓటమి  గెలుపు సహజం డిడి వై పోచం

క్రీడాల్లో ఓటమి  గెలుపు సహజం డిడి వై పోచం

క్రీడాల్లో ఓటమి  గెలుపు సహజం డిడి వై పోచం

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : క్రీడాల్లో ఓటమి, గెలుపు సహజం అని, ఏటూరునాగారం ఐటిడిఏ డిడి వై. పోచం అన్నారు.ఏటూరునాగారం ఐటిడిఏ ఆధ్వర్యంలో
ఐదవ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండు రోజులు నిర్వహించారు. క్రీడాల ముగింపు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిడి వై. పోచం పాల్గొన్ని క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని గెలిచిన వారికి ఆనందం ఓడిన వారికి అనుభవం మిగులుతుందని, ఈ అనుభవం రేపటి గెలుపుకి పునాదులవుతుందని , మారు మూల ప్రాంతాల నుండి ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దిన పీడీలను, పిటిలను అభినందించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.అక్కడ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో క్రీడా నైపుణ్యం ప్రదర్శించి, ఐటీడీఏ ఏటూరునాగారంకు, మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు..ఈ పోటీలలో పాల్గొని,గెలుపొందినటువంటి విద్యార్థినీ విద్యార్థులకు ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ సర్టిఫికెట్లను అందచేశారు.ఈ సమావేశంలో ఏ టి డి ఓ దేసిరాం, క్షేత్రయ్య, ఏ సీఎం ఓ.రవీందర్, డిప్యూటీ డిఇఓ సారయ్య, ఎస్ ఓ శ్యామలత, ఆదినారాయణ, డాక్టర్ కిస్తూ నారాయణ,సిహెచ్ కొమ్మలు, పిజీహెచ్ఎంలు ఎం నాగేశ్వరరావు, కే. శ్రీనివాస్,పి శ్రీనివాస్,డి.రేవతి గారు, పిడిలు, పిఇటి లు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.(Story:క్రీడాల్లో ఓటమి  గెలుపు సహజం డిడి వై పోచం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!