కార్తీక మాసం సందర్భంగా పంచారామ శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
న్యూస్‌తెలుగు/వినుకొండ : రానున్న కార్తిక మాసాన్ని పురస్కరించుకుని వినుకొండ డిపో నుండి పంచారామాలకు ప్రత్యేక అల్ట్రా డీలక్స్ బస్సులను నవంబర్ 3, 10, 17, 24 వ తేదీలలో ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ప్రయాణికులు ఒక్కొక్కరికి చార్జీ 1400 రూపాయలు ఉంటుందన్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు బస్సు స్థానిక డిపో నుండి బయలుదేరి సోమవారం రోజు పంచారామాలను భక్తులకు చూపించుకొని మంగళవారం ఉదయం తిరిగి వినుకొండకు వస్తుందన్నారు. మరియు మహానంది, అహోబిలం, యాగంటి, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, సిద్దేశ్వర మఠానికి కూడా అల్ట్రా డీలక్స్ బస్సు రిజర్వేషన్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. ₹1600 చార్జీతో కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలానికి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయుచున్నారని డిపో మేనేజర్ తెలిపారు. మరిన్ని వివరాల కొరకు సెల్ 99592 25431 ; 73828 88783 ; 73828 98320 సంప్రదించవచ్చన్నారు. (Story : కార్తీక మాసం సందర్భంగా పంచారామ శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు)