UA-35385725-1 UA-35385725-1

మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చెయ్యాలి

మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చెయ్యాలి

న్యూస్ తెలుగు/వనపర్త : గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ సమావేశం అక్టోబర్ 27 ఆదివారం రోజు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అనిఫ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ. దీపావళి పండుగ ఉన్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నాలుగు నెలల నుండి జీతాలు బకాయిలు ఉన్నాయని. పండుగకు కూడా జీతాలు రాకపోతే వారు ఎలా పండుగలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చే జీతాలు తక్కువ అని పైగా నెలల తరబడి జీతాలు బకాయి ఉండడంతో కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు చెల్లించాలని. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని. బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులు చేస్తూ గ్రామాలను పరిశుభ్రతకు పచ్చదనానికి నిలయంగా నిలుపుతున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకపోవడం దారుణమని. కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులపై పని భారం తగ్గించాలని వేధింపులు ఆపాలని. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు వారి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.. జీవో నెంబర్ 51 సవరించాలని. వారంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలని. పిఎఫ్ ఇఎఫ్సి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు పై సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 5 6 హైదరాబాద్ ఇందిరాపార్క్ తేదీల్లో జరుగు 48 గంటల రిలే దీక్షలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కోశాధికారి పుష్ప శీను దాసు వెంకటేష్ లక్ష్మన్న రాజు సుగ్రీవుడు వెంకటయ్య శ్రీను నాగన్న తదితరులు పాల్గొన్నార.(Story:మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చెయ్యాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1