ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు చేస్తూన్న వాటిపై చర్యలు గైకొనండి
జేఏసీ విద్యార్థి సంఘాలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ సరి అయిన నియమ నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థలు నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న పాఠశాలలపై చర్యలు గైకొనాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయంలో ఇంచార్జ్ ఏవో అంపయ్య కు వినతి పత్రాన్ని జేఏసీ విద్యార్థి సంఘాలు అందజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మంజుల నరేంద్ర, అమర్నాథ్ రెడ్డి, పోతులయ్య, నిరంజన్, బాలాజీ నాయక్, పవన్ కుమార్ రెడ్డి, శివ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు, ధర్మవరం మండల విద్యాశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్మవరం పట్టణంలో దాదాపుగా 35 నుంచి 40 వరకు ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతున్నారు అని, పాఠశాలల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా అదేవిధంగా ఫైర్ శానిటేషన్ ఎలాంటి నియమ నిబంధన లేకుండా ఇష్టానుసారంగా పాఠశాలలు నడుపుతుండడం దారుణమన్నారు. ఈ ఫీజుల విషయంపై అరికట్టాలని దాదాపుగా విద్యార్థి సంఘాలుగా ధర్మవరం పట్టణ విద్యాశాఖ అధికారికి ఎన్నో ఏళ్ళుగా వినతి పత్రాలు అందించిన కూడా పట్టించుకోని పాపాన పోలేదు అని మండిపడ్డారు. మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలు వాళ్ళ టేబుల్కే పరిమితము అయ్యాయే కానీ, ఏ రోజు కూడా వారిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు అని తెలిపారు. కాబట్టి తక్షణమే తమరు విద్యార్థుల జీవితాలు విద్యను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ధర్మవరం పట్టణంలో ప్రవేట్ విద్యాసంస్థల యాజమాన్యం వారు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడిని అరికట్టి, పేద ప్రజల తల్లిదండ్రుల విద్యార్థుల ధనాన్ని కాపాడవలసిందిగా వారు తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీగా డిమాండ్ చేశామని తెలిపారు. (Story : ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు చేస్తూన్న వాటిపై చర్యలు గైకొనండి)