శేర్ పల్లి పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం
న్యూస్ తెలుగు/వనపర్తి : శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి పేర్కొన్నారు గ్రామస్తుడు అయినటువంటి నాగరాజు తన సొంత నిధులతో పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధ జల కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్యన బాణాసంచా కాల్చుతూ రకరకాల పూల వర్షాన్ని కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, దాన గుణం ఉన్న వ్యక్తులు గ్రామ అభివృద్ధి కాంక్షించే యువకులు ఉన్న గ్రామం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాఠశాలలో సరైన గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన ఎమ్మెల్యే అత్యవసరంగా రెండు గదులను వెంటనే నిర్మించాలని అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు తాను చేస్తానని గ్రామస్తులు సూచించారు
విద్యాభివృద్ధికి పెద్దపీట వేసిందని ఈ క్రమంలోనే “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్‌కు” శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసి మూడవ తరగతి నుంచి డిగ్రీ వరకు అత్యుత్తమ విద్యను అందించేందుకు ఈ ఎడ్యుకేషనల్ హబ్బులు ఉపయోగపడతాయని ఆయన వివరించారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టిందని పాఠశాల విద్యార్థులకు దుస్తుల తయారీ ఆర్టీసీ బస్సులు కొనుగోలు మహిళా సంఘాల భాగస్వామ్యం లాంటి అనేక చర్యలు చేపట్టి తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు ముందుకెల్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సిద్ధని డీజిల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నాగరాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా గ్రామస్తులకు సైతం తాగునీటి శుద్ధ జలాన్ని అందించేందుకు సహకరిస్తానని ముందుకు వచ్చిన ఆయనను ఎమ్మెల్యే సన్మానించారు. యువకులు ముందుకు వచ్చి గ్రామంలో మూకుమ్మడి శ్రమదాన కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని దాంతో గ్రామానికి అత్యుత్తమ పురస్కారాలు చేత లభిస్తాయని ఆయన యువకులకు సూచించారు. కన్న తల్లిదండ్రులను జన్మనిచ్చిన గ్రామాన్ని ఎప్పుడు కూడా మరువకూడదని ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన మన చిరునామా జన్మనిచ్చిన గ్రామమే అవుతుందని గ్రామానికి ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించేలా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు
గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలు ఉండాలని తనవంతు సహాయ సహకారాలు ఎప్పటికి అందిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భారతి, ఎంపీడీవో రవి నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, మండల నాయకులు శ్రీహరి రాజు, బీరం రాజశేఖర్ రెడ్డి గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story:శేర్ పల్లి పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం)