UA-35385725-1 UA-35385725-1

ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి

ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి

మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర

న్యూస్ తెలుగు /సాలూరు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక మాఫియా ఎక్కువైందని దీన్ని అరికట్టి సామాన్య ప్రజలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర అన్నారు శుక్రవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కుటమీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిర్మాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసకను అధికార పార్టీ నాయకులే ప్రజలకు అమ్ముకొని దందాలు చేస్తు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు . అధికారులు ప్రతిపక్ష ఇసుక ట్రాక్టర్లకు వేరేగా అధికార పక్ష ఇసుక ట్రాక్టర్లకు మరోలాగా చూడడం చాలా బాధాకరమని అన్నారు. ఉచిత ఇసుక ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ అమలు చేస్తారా అని అన్నారు. ఉచిత ఇసుకపై కలెక్టర్ కు గనులు శాఖ ఏడికి లేఖలు రాస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు కౌన్సిలర్లు గిరి రఘు .గొర్ల వెంకటరమణ వైకాపా నాయకులు తాడి శంకర్రావు యశోదకృష్ణ హరి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. (Story :ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1