ఆర్టికల్ 370 రద్దుతో బిజేపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన జమ్మూ కాశ్మీర్ ప్రజలు
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్
న్యూస్‌తెలుగు/వినుకొండ : కాశ్మీర్ ప్రజలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిన 370 ఆర్టికల్ ను బిజెపి అక్రమంగా ఎత్తివేయడం జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరస్కరించారని, ఆ రాష్ట్రంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు దానికి అద్దం పడుతున్నాయని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం శివయ్య భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో బిజెపిని ఓడించి ఇండియా కూటమిగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి గెలుపొందడం జరిగిందని, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కామ్రేడ్ తరిగామి ఈ ఎన్నికల్లో గెలుపొందడం కామ్రేడ్ తరిగామి బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరము జమ్మూ కాశ్మీర్లో వ్యతిరేకించి ప్రచారం చేయడం 370 ఆర్టికల్ రద్దు జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి తగ్గించి రాష్ట్ర హోదాను తీసివేసి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి రాష్ట్రాన్ని తీసుకోవడం అక్కడ పండిస్తున్న ఖరీదైన పంటలు కుంకుమపువ్వు, గసగసాలు, అలాగే కాఫీ తేయాకు తోటలు అన్నింటినీ ఆదాని, అంబానికి లాంటి గుత్త పెట్టుబడిదారులకు కట్టబెట్టుచు స్థానిక రైతులను దివాలా తీయించి కూలీలుగా మార్చి వేస్తున్న బిజెపి వైఖరిని అచ్చటి కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండిస్తు రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. కాశ్మీర్లో ప్రజలు మోడీ రద్దుచేసిన 370 ఆర్టికల్ ను హోం మినిస్టర్ అమిత్ షా నిరంతర ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తే ఆచటి ప్రజలు దానిని తిరస్కరించారని అక్కడి ప్రజలు నిరసన తెలియజేసి బిజెపికి గొప్ప గుణపాఠం నేర్పారని అలాగే హర్యానా ఎన్నికల్లో కూడా బిజెపికి మూడోసారి గెలిచిన సీట్ల సంఖ్యను ప్రజలు తగ్గించగలిగారని దేశంలో బిజెపి ప్రతిష్ట రోజు రోజుకి మసకబారుతోందని మతోన్మాద విధానాలతో దేశం పరువు ప్రతిష్టలు మంట కలుపుతున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్నికలలో పాల్గొంటున్నారని దేశంలో రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య లౌకిక విధానాలే దేశపురోభివృద్ధికీ తోడ్పడగలవని భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని కులాలు, మతాలు జాతులు అన్నదమ్ముల వలె కలిసి జీవించుటకు మన రాజ్యాంగాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ దేశ పురోభివృద్ధిలో సాగుటకు ప్రజలు ముందుకు రావాలని ఆయన అన్నారు. సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి యు.రాము తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్టికల్ 370 రద్దుతో బిజేపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన జమ్మూ కాశ్మీర్ ప్రజలు )