సమస్యల సత్కార పరిష్కారానికి ప్రజావాణి
ప్రజావాణి కి 26 దరఖాస్తులు
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది దరఖాస్తు దారుల వద్ద నుండి అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు లతో కలిసి స్వీకరించారు. అట్టి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 26 దరఖాస్తులు రాగా 13 భూ సమస్యలకు సంబంధించినవి 2ఉపాధి కల్పించుటకు, 3 లోన్లు మంజూరు కోరుతూ, 8 ఇతరములు వచ్చినవని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి సి ఎస్ ఓ షహ ఫైసుల్ హుస్సేని, డి ఎం డి సి ఎస్ ఓ రాం పతి, డిసిఓ సర్దార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, డి ఈ ఓ పాణిని, సి పి ఓ ప్రకాష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : సమస్యల సత్కార పరిష్కారానికి ప్రజావాణి)