ట్లో సత్తా చాటిన తేజ.. కోచ్ రాజశేఖర్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఆర్ డి టి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ధర్మవరం జట్టులోని తేజ 132 (105) పరుగులతో సత్తా చాటాడని కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుక్కరాయడముద్రలో, బుక్కరాయదముద్రం అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తలపడ్డగా ,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 40 ఓవర్లలో 317 చేసింది అని తెలిపారు. తదుపరి.ధర్మవరం జట్టులోని తేజ 132(105) పరుగులతో సత్తా చాటాడు అని తెలిపారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన బుక్కరాయదముద్రం జట్టు 12.4 ఓవర్లలో 19 పరుగులు చేసి అల్లౌట్ అయింది అని తెలిపారు. ధర్మవరం జట్టు 298 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.(Story:ట్లో సత్తా చాటిన తేజ.. కోచ్ రాజశేఖర్.)