UA-35385725-1 UA-35385725-1

వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు

వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఎన్.ఎస్. ఎస్. విభాగాలతో పాటు అటవీ శాఖ (బుక్కపట్నం) వారి సంయుక్త సౌజన్యం తో స్వర్ణాంధ్ర2047లో అంతర్భాగంగా చివరి రోజు కార్యక్రమంగా వన్య ప్రాణుల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ సత్యసాయి జిల్లా – బుక్కపట్నం అటవీ క్షేత్రంనుండి ఫారెస్ట్ డెప్యూటి రేంజ్ ఆఫీసర్ కె. హుసేనప్ప విచ్చేశారు .
విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ వన్య ప్రాణుల, జంతువుల పట్ల ప్రేమ, దయతో మెలగాలని , అటవీ సంపదను సంరక్షించాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా వాటికి అవసరమైన మంచి వాతావరణాన్ని కల్పించాలని కోరారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి పావని
ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ పర్యవేక్షణ లో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది అక్కులప్ప, సునంద, పుల్లప్ప, అధ్యాపకులు త్రివేణి , చిట్టెమ్మ, షమీవుల్లా, కిరణ్ కుమార్ , భువనేశ్వరి, హైమావతి, పుష్పవతి , సరస్వతి బి. ఆనంద్, మీనా, నాగరాజు. ధనుంజయ, బోధననేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : వన్య ప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన సదస్సు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1