అధికారులు ప్రభుత్వ వారదులుగా పని చేయాలి
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేయాలని ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, ఎంపీఓ లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు ప్రత్యేకంగా రాయితీ గ్యాస్ సిలిండర్లా వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి రాయితీ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గృహజ్యోతి పథకం కింద చేపట్టిన కరెంట్ జీరో కరెంట్ బిల్లు ను సైతం ప్రతి ఒక్క వినియోగదారునికి ఉపయోగపడేలా మండల స్థాయిలోని ఎంపీడీవోలందరు దృష్టారించి లబ్ధిదారులకు రాయితీ అద్దెల చూడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ ల ఆధ్వర్యంలో చేపట్టిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఈఈ మల్లయ్య, డిఈ బండారి శ్రీనివాస్ లను ఆదేశించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు అంశాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు ఎంపీలు పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : అధికారులు ప్రభుత్వ వారదులుగా పని చేయాలి)